కలం, వెబ్ డెస్క్ : పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్యాతో జట్టు బస్‌లో జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్నోలో జట్టు ప్రయాణిస్తున్న సమయంలో తీసిన ఈ వీడియో అర్ష్‌దీప్ స్నాప్‌చాట్ స్టోరీలో వచ్చినట్లు ప్రచారం జరిగింది. వీడియోలో ప్రియాంశ్ ఆర్యా, హర్‌ప్రీత్ బ్రార్‌తో కలిసి కూర్చున్నాడు. అర్ష్‌దీప్ కెమెరాలో కనిపించకపోయినా, అతని గొంతు వినిపించినట్లు అభిమానులు గుర్తించారు. ప్రియాంశ్ నవ్వు గురించి సరదాగా మాట్లాడిన అతడు, పళ్లు చూపించమంటూ వ్యాఖ్య చేసినట్లు వీడియోలో వినిపించింది. దీంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది.
కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు మాత్రం ప్రియాంశ్ అసౌకర్యంగా కనిపించాడని కామెంట్లు చేశారు. వీడియోలో అతడు ఫోన్ మాట్లాడుతూనే కెమెరా వైపు చూడకపోవడం కూడా చర్చకు దారి తీసింది. ఇటీవల తిలక్ వర్మపై చేసిన వ్యాఖ్యలతో కూడా అర్ష్‌దీప్ (Arshdeep Singh) విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే జట్టు పేరుపై కామెంట్ చేసిన ఓ అభిమానికి ఘాటుగా స్పందించిన ఘటన కూడా వైరల్ అయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుసగా ఆరు ఓటములతో ప్లేఆఫ్ రేసులో వెనుకబడింది. ఇప్పుడు లక్నోపై గెలిస్తేనే ఆశలు కొనసాగనున్నాయి. అర్ష్‌దీప్‌పై విమర్శలు వచ్చినా, అతడు మానసికంగా ప్రభావితం కాలేదని జట్టు స్పోర్ట్స్ సైన్స్ హెడ్ ఆండ్రూ లీపస్ తెలిపారు.
Read Also: పేరెంట్స్‌ను వేధించిన కొడుక్కి జైలు శిక్ష.. డీసీపీ బృందానికి సజ్జనార్ ప్రశంసలు
Follow Us On: X(Twitter)

