కలం, వెబ్ డెస్క్ : గ్రూప్-1 పరీక్షల మీద తెలంగాణ హైకోర్టులో(High Court) వాదనలు ముగిశాయి. 2026 జనవరి 22న తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు. గ్రూప్ -1 ఎగ్జామ్ (Group 1 Exam) ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ, మెయిన్ కు సెలెక్ట్ అయిన వారు డివిజన్ బెంచ్ కు వెళ్లారు. డివిజన్ బెంచ్ ఆ రద్దు తీర్పుపై స్టే ఇచ్చింది. నేడు మరోసారి దాని మీద వాదనలు జరిగాయి. టీజీపీఎస్సీ తరఫున ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. గ్రూప్ -1 ఎగ్జామ్ పారదర్శకంగా జరిగిందని.. అవకతవకలు జరగొద్దనే ఉద్దేశంతో ఇద్దరితో పేపర్ మూల్యాంకనం చేయించారని తెలిపారు.
అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున డి.ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎగ్జామ్((Group 1 Exam)) లో క్వాలిఫై కాని వారు కోర్టులో పిటిషన్ వేశారని.. వారి వాదనలు చాలా భిన్నంగా ఉన్నాయని తెలిపారు. రెండు హాల్ టికెట్లు ఇస్తారని ముందే చెప్తే అప్పుడు అబ్జెక్షన్ చెప్పకుండా.. రిజల్ట్ వచ్చాక దానిపై పిటిషన్ వేయడం అర్థం లేనిదన్నారు ప్రకాశ్ రెడ్డి. ఇలా ఇరువురి వాదనలు విన్న కోర్టు వచ్చే జనవరి 26కు తీర్పును రిజర్వ్ చేసింది.
Read Also: నగరంలో ఫ్లై ఓవర్‌లు క్లోజ్.. న్యూ ఇయర్ వేళ పోలీసుల ఆంక్షలు
Follow Us On: X(Twitter)


