మొంథా తుపాను(Cyclone Montha) కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిద్దిపేట(Siddipet) జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో తూకం వేసిన వడ్ల బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమకు నష్టం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం వేసిన తర్వాత కూడా వడ్ల బస్తాలను మిల్లులకు తరలించకుండా అక్కడే ఉంచారని, దాంతో వర్షాలు కురవడంతో వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనడం లేదని, తూకం వేసిన తర్వాత కూడా మిల్లులకు తరలించడం లేదని, ప్రభుత్వం సకాలంలో వడ్లు కొని ఉంటే వర్షాలకు తాము నష్టపోయి ఉండేవాళ్లం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

