సర్వోదయ తెలంగాణ కోసమే కొత్త పార్టీ : కవిత

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసమే కొత్త పార్టీ పెడుతున్నట్టు జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ప్రకటించారు. శ్రీరామ నవమి సందర్భంగా నిజమాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత కొత్త పార్టీ గురించి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో సర్వ కులాల అభ్యున్నతి కోసమే కొత్త పార్టీ పెడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని.. ప్రజలు ప్రాణాలు పోతున్నా అస్సలు పట్టించుకోవట్లేదని చెప్పారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని అన్ని మతాలు, కులాలకు అండగా ఉండి వారి సమస్యలు తీర్చేందుకు ఈ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నానని కవిత చెప్పారు.

ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని పెడుతున్నట్టు తెలిపారు. మేడ్చల్ మునీరాబాద్ అనే ఊరులో అధ్వయ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం ఉంటుందని కవిత చెప్పారు. 18 ఎకరాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు చాలా మందిని అక్కడ గౌరవించుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని కవిత స్పష్టం చేశారు. అన్ని కులాలు, మతాల వారు ఈ సభకు తరలి రావాలని కవిత వెల్లడించారు. ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న జాగృతి కూడా రాబోయే రోజుల్లో పార్టీలో కీలకంగా ఉంటుందని కవిత (Kavitha) స్పష్టం చేశారు.

Read Also: అమెరికా చరిత్రలో తొలిసారి.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>