కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర (Shobha Yatra) సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాం బాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర సాగనండగా… శోభాయాత్ర సందర్భంగా రాత్రి 9 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.సీతారాంబాగ్ నుండి కోటి హనుమాన్ హనుమాన్ వ్యయమశాల వరకు సాగే శోభాయాత్రకు 3000 నుంచి 5000 పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సిద్ధిమ్బర్ బజార్ మసీదు సహా మార్గంలోని మసీదుల వద్ద ప్రతి ఏడాదిలాగే తెల్లటి వస్త్రాలతో కవరింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో జరుగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ యాత్ర ఇవాళ రాత్రి 10 గంటల‍్లోగా ముగిసేలా పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి యాత్ర సాగే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామని వెల్లడించారు.

