కలం, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై తనకున్న అభిమానాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా చాటుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయన్నసీఎం రేవంత్ రెడ్డికి వీరాభిమాని. ఆయనను ఎలాగైనా కలవాలనే ఆకాంక్షతో ఏకంగా 350 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. అక్టోబర్ 29న ఆదోని నుంచి తన పాదయాత్రను ప్రారంభించిన సాయన్న (Sayanna) ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తొమ్మిది రోజుల పాటు నడిచి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎం రేవంత్‌ను కలవాలన్న పట్టుదలతో సాగించిన ఈ పాదయాత్ర ప్రయాణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీకి చెందిన యువకుడు తెలంగాణ నేత కోసం పాదయాత్ర చేయడం నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల అభిమానులు తమకు ఇష్టమైన వారిని కలిసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, సాయన్న మాత్రం తన అభిమానాన్ని చాటుకునేందుకు వందల కిలోమీటర్లు నడవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 350 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో హైదరాబాద్ చేరుకున్న సాయన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం (Revanth Reddy) సాయనన్నను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
Also Read : రైతులకు నిల్.. బీర్ కంపెనీలకు నీళ్లు: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

