ఎరువుల దుకాణంలో చోరీ.. రూ. 25వేలు నగదు అపహరణ

కలం,‌ జోగులాంబ గద్వాల: ధరూర్ మండలం అల్వాల్‌ పాడు (Alwalpad) గ్రామ శివారులో‌ ఉన్న జై హనుమాన్ అగ్రో ఎరువుల దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షెట్టర్‌ను ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారని, క్యాష్‌ బాక్సులో ఉన్న రూ.25వేల నగదును అపహరించారని బాధితుడు తిరుమల్‌రెడ్డి తెలిపారు.

ఉదయం షాపు తెరిచేందుకు యజమాని వెళ్గగా షెట్టర్ ధ్వంసం చేసి‌ ఉండటాన్ని గమనించాడు. షాపు తెరిచి‌ చూడగా క్యాస్ బాక్సులో ఉన్న డబ్బు ఎత్తెకళ్లారు. వెంటనే ధరూర్ పోలీసులకు సమాచారమివ్వగా..ఎస్సై తారక సంఘటన స్థలాన్ని పరిశీలించింది. క్లూస్‌ టీం వచ్చి చోరీ జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>