వనపర్తిలో కార్పొరేట్‌ స్థాయి విద్యా సౌకర్యాలు.. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే!

కలం, వనపర్తి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా వనపర్తి పట్టణంలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల భవన సముదాయ పనులను శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ సముదాయంలో పాఠశాల, జూనియర్‌ కళాశాలతో పాటు ఆధునిక సైన్స్‌ ల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాభ్యాసం చేసిన ఈ పాఠశాలను అత్యాధునిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం వనపర్తికి గర్వకారణమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, ఎస్‌ఎల్‌ఎన్‌ రమేష్‌, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కదిరె రాములు, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>