కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పట్టణాలు, మున్సిపాలిటీలు, నగరాల్లోని వార్డు సచివాలయాలకు కొత్త పేరు తీసుకొచ్చింది. ఇకపై వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డులుగా పిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఈ మార్పుతో మరింత పారదర్శకంగా సేవలు అందిస్తామని మంత్రివర్గం వెల్లడించింది. తాజాగా దీనికి సంబంధించిన గెజిట్ విడుదల చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సీఎస్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ పేరు మార్పుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


