కలం వెబ్‌డెస్క్: సింగపూర్‌లో ఏపీ మంత్రుల (AP Ministers) బృందం పర్యటించింది. భారత హై కమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ (Ponguru Narayana), బీసీ జనార్దన్ రెడ్డి (B. C. Janardhan Reddy), వంగలపూడి అనిత (Vangalapudi Anita), కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu), సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav)లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్ (Gan Siow Huang)తో మంత్రులు భేటీ అయ్యారు. ఈ కీలక భేటీలో భారత్-సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించారు. అంతే కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. నేటి నుంచి ఏప్రిల్ 27 వరకు 7 రోజుల పాటు సింగపూర్‌లో మంత్రుల బృందం పర్యటించనుంది.
Read Also: బీఆర్ఎస్ ఉట్టి కథలు.. కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పింది: కవిత
Follow Us On: X(Twitter)

