కలం, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మంగళవారం అనీల్ చంద్ర పునేఠా (Anil Chandra Punetha) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉద్యోగులు నూతన ఎస్‌ఈసీ (Election Commissioner)కి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం అనీల్ చంద్ర పునేఠా రాష్ట్ర మూడో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనీల్‌చంద్ర పునేఠా (Anil Chandra Punetha) పనిచేశారు.1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనీల్‌చంద్ర పునేఠా.. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా నియమించింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నీలంసాహ్ని పదవీ కాలం గత నెల 31తో ముగిసింది.
Read Also: బీఆర్ఎస్ ఉట్టి కథలు.. కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పింది: కవిత
Follow Us On: Instagram

