కలం, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నితీశ్ రెడ్డి (Nitish Reddy) ప్లేస్ ఏంటి? అతడు ఎక్కడ ఆడతాడు? ఏం చేస్తాడు? అంటూ ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఆకాష్ చోప్రా (Aakash Chopra) సూటి ప్రశ్నలు సంధించారు. ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని వాడుకుంటున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్, ఆటగాళ్ల పాత్రలపై స్పష్టత తెచ్చుకోవాలని సూచించారు. నితీష్ బౌలింగ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ గందరగోళంగా ఉందని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. కొన్ని మ్యాచుల్లో కొత్త బంతిని ఇచ్చి, మరికొన్ని మ్యాచుల్లో ఇవ్వకపోవడం వల్ల అతని పాత్ర ఒక పజిల్‌గా మారిందని విమర్శించారు. నితీష్ ప్రస్తుతం మంచి వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని, అతనికి బౌలింగ్‌లో ఒక స్థిరమైన బాధ్యత ఇవ్వాలని కోరారు.
బ్యాటింగ్ ఆర్డర్ విషయంలోనూ నితీష్‌ను వెనక్కి నెట్టడంపై చోప్రా (Aakash Chopra) అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనికేత్ వర్మ, సలీల్ అరోరా వంటి వారిని నితీష్ కంటే ముందు పంపడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి భారీ హిట్టర్లు ఉన్నప్పటికీ, నితీష్‌ను పైస్థానంలో పంపడానికి సంకోచించకూడదని సూచించారు. ఈ సీజన్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 160 స్ట్రైక్ రేట్‌తో 136 పరుగులు చేసిన నితీష్, బౌలింగ్‌లో నాలుగు వికెట్లు కూడా తీశారు. రానున్న మ్యాచుల్లోనైనా ఈ యువ ఆల్‌రౌండర్ ప్రతిభను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని క్రికెట్ విశ్లేషకులు ఆశిస్తున్నారు.
Read Also: బుమ్రాపై అదే ప్రభావం చూపింది: అశ్విన్
Follow Us On: Instagram

