Mobile Popup Ad
Mobile Popup Ad

సింగపూర్ పర్యటనకు ఏపీ మంత్రులు

కలం, వెబ్ డెస్క్: ఏపీ మంత్రులు (AP Ministers) సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం వంటి అంశాల్లో నైపుణ్యాలు పొందేందుకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి 27 వరకు ఈ పర్యటన కొనసాగనున్నది. మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్ర ప్రణాళిక విభాగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా వీరితో కలిసి పర్యటనలో పాల్గొంటారు.

సింగపూర్‌లో శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఈ మంత్రులు రాష్ట్రానికి తిరిగి వచ్చాక ప్రజాప్రతినిధులు, అధికారులకు మార్గదర్శకులుగా ఉండి శిక్షణ ఇవ్వనున్నారు. ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్య సాధనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. తొలి రోజు ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. రెండో రోజు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పెంచుతూ ప్రజలకు మరింత చేరువయ్యే విధానాలపై చర్చ ఉంటుంది. మూడో రోజు అత్యవసర పరిస్థితుల్లో సంక్షోభ నిర్వహణపై మార్గదర్శనం ఇస్తారు. నాలుగో రోజు డిజిటల్ గవర్నెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శిక్షణ ఉంటుంది. ఐదో రోజు ఆర్థికాభివృద్ధి వ్యూహాలపై దృష్టి సారిస్తారు. ఆరో రోజు ప్రజల్లో పాలనపై విశ్వాసం పెంపొందించడం, రాజకీయ బాధ్యతలపై అవగాహన కల్పిస్తారు. ఏడో రోజు కార్యాచరణ ప్రణాళికపై చర్చించి శిక్షణ కార్యక్రమాన్ని ముగిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>