కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సోమవారం బంగారం ధరలు (Gold and silver prices) స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం రూ. 1,52,840 ఉండగా రూ.380 తగ్గి రూ.1,52,460గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,40,100 ఉండగా రూ.350 తగ్గి రూ. 1,39,750గా నమోదయింది. 24 క్యారెట్ల 1గ్రాము గోల్డ్ ధర రూ.38 తగ్గి రూ.15,246 గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఒక గ్రాము పుత్తడి ధర రూ.35 తగ్గి రూ.13,975 గా ఉంది. ఒక కిలో వెండి రేటు భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ ధర రూ.5000 తగ్గి రూ.2,55,000గా ఉంది.
ఒక గ్రాము గోల్డ్ రేటు ముఖ్య నగరాల్లో స్వల్ప తేడాలో ఉంది. హైదరాబాద్‌లో ఒక గ్రాము వెండి రేటు రూ.15,246, చెన్నైలో రూ.15,381, ముంబైలో రూ.15,246, ఢిల్లీలో రూ.15,261, కలకత్తాలో రూ.15,246, బెంగుళూరులో రూ.15,246, కేరళలో రూ.15,246, పూణేలో రూ.15,246, వడోదరలో రూ.15,251, అహమ్మదాబాద్‌లో రూ.15,251గా ఉంది.

