కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ (Inter Exams) షెడ్యూల్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 దాకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 దాకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు.
అయితే మార్చి 3న హోలీ పండగ ఉండటంతో ఆ రోజు జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్-2ఏను మార్చి 4వ తేదీకి మార్చారు. అలాగే మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1 ఎగ్జామ్స్ ను మార్చి 21న నిర్వహిస్తామని తెలిపారు. మిగతా అన్ని ఇంటర్ ఎగ్జామ్స్ (Inter Exams) షెడ్యూల్ ప్రకారమే జరుపుతామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల దాకా ఎగ్జామ్స్ ఉంటాయి.
Read Also: అమెరికా సంచలన కేసులో బిల్గేట్స్!
Follow Us On: Sharechat


