కలం, వెబ్డెస్క్: అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ (Bill Gates) ఫొటో వెలుగులోకి వచ్చింది. గురువారం ఎప్స్టీన్ కేసులోని 68 ఫొటోలను హౌస్ ఓవర్సైట్ కమిటీకి చెందిన డెమొక్రాట్ సభ్యులు రిలీజ్ చేశారు. ఇందులో ఓ మహిళతో బిల్గేట్స్ ఉన్న ఫొటో కూడా ఉంది. మహిళ ముఖం కనపడకుండా బ్లర్ చేశారు. అలాగే ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త నోమ్ చోమ్ స్కీ, ఎప్స్టీన్తో కలసి ఉన్న మరో ఫొటో కూడా ఉంది. ఈ పొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా, ఎప్స్టీన్ అనే బిజినెస్ మ్యాన్.. అమ్మాయిలను ట్రాప్ చేసి అతిపెద్ద సెక్స్ కుంభకోణానికి పాల్పడినట్లు 2004లో బయటపడిన సంగతి తెలిసిందే.
సంపన్నులు, రాజకీయ నాయకులు, క్రీడా దిగ్గజాలకు అమ్మాయిలను ఎప్స్టీన్ ఎరగా వేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసులో అరెస్టైన ఎప్స్టీన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనకు సహకరించిన ప్రియురాలు మాక్స్వెల్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన రికార్డులు, దర్యాప్తు పత్రాలు, హార్డ్ డిస్క్ల్లోని పూర్తి వివరాలు డిసెంబర్ 19 అర్ధరాత్రిలోగా అమెరికా న్యాయశాఖ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సమాచారంలో తనకు ఇబ్బంది కలిగించే వాటిని ప్రభుత్వం దాచి పెడుతుందనే అనుమానంతో ప్రతిపక్ష డెమొక్రాట్ సభ్యులు గురువారం ఈ ఫొటోలను విడుదల చేశారు. ఇందులో బిల్గేట్స్ (Bill Gates) ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Read Also: గ్రీన్ కార్డు లాటరీ ఆపేసిన ట్రంప్.. ఇండియాపై ఎఫెక్ట్ ఎంత..?
Follow Us On : WhatsApp


