Mobile Popup Ad
Mobile Popup Ad

మత్స్యకారుల గల్లంతుపై ప్రభుత్వానికి నివేదిక

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులకు (Fishermen Missing Case) సంబంధించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఘటన జరిగిన పరిస్థితులు, గల్లంతైన మత్స్యకారుల వివరాలు, వారిని గుర్తించేందుకు చేపట్టిన గాలింపు చర్యలపై నివేదికలో వివరాలు పొందుపరిచారు.

త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మరణించినట్లుగా ధృవీకరించింది. కాగా, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తలో రూ.10 లక్షలు తక్షణ సాయం ప్రకటించింది. మంత్రి కొల్లు రవీంద్ర ఆ చెక్కుల్ని బాధిత కుటుంబాలకు అందజేశారు.

జులై 4న వేటకు వెళ్లి తిరిగివస్తున్న మత్స్యకారులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఏడుగురు మత్స్యకారులు గల్లంతు కాగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డులు మత్స్యకారుల ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎంతకీ వారి ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నమే ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు.

అయితే, మత్స్యకారుల కుటుంబసభ్యుల వినతితో ప్రభుత్వం బుధవారం వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించింది. అయినా, ఆచూకీ లభించకపోవడంతో ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించి ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు.

Read Also: గోదావరి-కృష్ణా అనుసంధానానికి కీలకంగా పట్టిసీమ: నిమ్మల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>