అర్హత లేని అసెంబ్లీ సెక్రెటరీని తొలగించాలి

కలం, వెబ్ డెస్క్ : అర్హతలేని వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్‌గా నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి (Kakarla Venkatarami Reddy) ఈ మేరకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఆర్.టి నెంబర్ 288 (తేది: 15.07.2024) ద్వారా ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్-కమ్-ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసి స్వచ్ఛంద విరమణ పొందిన సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను శాసనసభ సెక్రటరీ జనరల్‌గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

జి.ఓ.ఎంఎస్ నెంబర్ 10 (19.03.2023) ప్రకారం ఈ పదవికి లోక్‌సభ, రాజ్యసభ లేదా ఏదైనా రాష్ట్ర శాసనసభలో సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసినప్పటికీ, ప్రసన్న కుమార్‌కు (Prasanna Kumar) అలాంటి అనుభవం లేదని ఆరోపించారు. అలాగే అసెంబ్లీ పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం కూడా ఆయనకు లేదని విమర్శించారు. అసెంబ్లీ సర్వీస్ నిబంధనల ప్రకారం ఉప కార్యదర్శి స్థాయి పై పోస్టులకు లా డిగ్రీ తప్పనిసరి అయినప్పటికీ, ప్రసన్న కుమార్ లా డిగ్రీ పొందిన విషయంపై స్పష్టత లేదని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే ఆయన సర్వీస్ వివరాల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పూర్తి వివరాలు పరిశీలించకుండా నియామకం చేపట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

వేతన విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఫండమెంటల్ రూల్ 110 ప్రకారం రిటైర్డ్ ఉద్యోగికి ఇచ్చే వేతనం పరిమితి ఉండాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం నెలకు రూ.4.90 లక్షలు చెల్లించడం అన్యాయమని అన్నారు. ఇది చీఫ్ సెక్రటరీ జీతం కంటే ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇక అసెంబ్లీలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను భర్తీ చేయకుండా, సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొందరు అధికారులను సస్పెండ్ చేయడం, విచారణలను ఆలస్యం చేయడం ద్వారా ప్రమోషన్లు నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్హతలేని సెక్రటరీ జనరల్‌ను వెంటనే తొలగించి, అనుభవం కలిగిన సీనియర్ ఉద్యోగులకు అవకాశమివ్వాలని  కాకర్ల వెంకటరామిరెడ్డి (Kakarla Venkatarami Reddy) డిమాండ్ చేశారు.

Read Also: వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఇంత నీచమా? అంటూ ఎమోషనల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>