కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా బురుగుపల్లిలో ఈ నెల 4న జరిగిన దోపిడీ కేసును (Siddipet Robbery) పోలీసులు ఛేదించారు. కాగా ఎంక్వైరీలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ దోపిడీకి సూత్రధారి ఓ ఆర్మీ అధికారి కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన శ్రీకాంత్ (41) అనే రిటైర్డ్ ఆర్మీ అధికారి IOC సంస్థలో పని చేస్తున్నాడు. వచ్చే వేతనం చాలకపోవడంతో స్నేహితులు, పాత నేరస్థులతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
శ్రీకాంత్ అండ్ ముఠా రెక్కీ నిర్వహించి ఈ నెల 4నరాత్రి 8 గంటలకు ఓ డాక్టర్ ఇంట్లోకి చొరబడ్డారు. కుటుంబసభ్యులను బెదిరించి వారిని తాళ్లతో కట్టేసి, కత్తులతో బెదిరించి, నగదు, బంగారు (Siddipet Robbery) ఆభరణాలతో పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన దొంగల ముఠా కోసం గాలించారు. గురువారం ఈ దొంగలముఠాను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 4.5 తులాల బంగారం, ఓ కారు, ఓ బైక్, 10 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.
Read Also: జాగృతి పోరాటాలతోనే మహిళా బిల్లు: కల్వకుంట్ల కవిత
Follow Us On : WhatsApp

