Mobile Popup Ad
Mobile Popup Ad

దిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిల్లీ బయల్దేరారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లిన ఆయన.. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. విభజన హామీలు, రాష్ట్రానికి ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తో భేటీ అయి, పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం CII బిజినెస్ సమ్మిట్‌కు హాజరై కీలక ప్రసంగం చేస్తారు. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ మహేంద్రదేవ్‌తోనూ సమావేశం అవుతారు.

రాత్రి దిల్లీలోనే.. రేపు అసోంకు..

ఈ రోజు రాత్రి సీఎం చంద్రబాబు దిల్లీలోనే బస చేయబోతున్నారు. రేపు ఉదయం అసోం రాష్ట్రానికి వెళ్లి.. నూతన సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నేరుగా విజయవాడ చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>