డిప్యూటీ సీఎం భార్యపై రిటైర్డ్ ఉద్యోగి సంచలన ఆరోపణలు

కలం, తెలంగాణ బ్యూరో : కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం 15% కమీషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలు గతంలో బహిరంగంగానే కామెంట్లు చేశారు. కొద్దిమంది ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్ల క్లియరెన్స్‌కు సైతం కమీషన్ అడుగుతున్నారని, అందువల్లనే చాలామందికి పేమెంట్ కాలేదని కూడా ఆరోపించారు. ఒక దశలో 15% కమీషన్ డిప్యూటీ సీఎం అంటూ అసెంబ్లీ వేదికగానే విమర్శలు చేశారు.

ఇది అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనకు దారితీసింది. దీనికి కొనసాగింపుగా వైద్యారోగ్య శాఖలో 2020 సంవత్సరంలో రిటైర్ అయిన ఓ మహిళా ఉద్యోగి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. రిటైర్ అయ్యి ఆరేండ్లు దాటినా ఇంకా ఫైనల్ బెనిఫిట్స్ అందలేదని, ఈ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదన్నారు. ఫైనాన్స్ డిపార్టుమెంటు ఆఫీసర్లను కూడా చాలాసార్లు కలిసి మొరపెట్టుకున్నానని తెలిపారు. ఈ నెల 7న ఇందిరా పార్క్ ధర్నాచౌక్ దగ్గర రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన సందర్భంగా ఆ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు.

రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ క్లియర్ అయ్యేందుకు తానే స్వయంగా డిప్యూటీ సీఎం భార్యను కలిశానని, 10% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు (Commission allegation). ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు చెప్పుకుంటున్నా గ్రౌండ్‌లో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ క్లియర్ కావడంలేదన్నారు. సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఆఫీసర్లే కొందరు బ్రోకర్ పని చేస్తున్నారని, తన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ క్లియర్ చేయడానికి వారు కూడా కమిషన్ అడుగుతున్నారని ఆమె ఆరోపించారు. డిప్యూటీ సీఎంపై గతంలో వచ్చిన ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తే ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగిని నుంచి రావడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>