ఇబ్బంది పెడుతున్నారు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : ఆదినారాయణ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : ఏపీ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి (MLA Adi Narayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలక కూటమిలో తనను ఇబ్బంది పెడుతున్నారని.. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ లో జరిగిన ‘మన ఊరు – మన జెండా’ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనను పార్టీ పరంగా ఇబ్బందిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజీనామాపై మూడు రోజులుగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే, పనులు జరగకపోయినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనకాడబోనని స్పష్టం చేశారు. గండికోట నిర్వాసితులను న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆది (Adi Narayana Reddy) ఆరోపించారు.

జిల్లాలో బీజేపీ ఇంకా బలపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇంకా సమస్యలున్నాయని దానిపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. తనకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. కాగా, ఆది కామెంట్స్ కూటమిలో తీవ్ర దుమారం లేపాయనే చెప్పాలి. ఆయన వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా ఆచరణకు కూడా దిగే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఇదే జరిగితే బీజేపీతో పాటు కూటమి ప్రభుత్వంపై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. మరి ఆది నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>