Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్‌ఆర్ vs ఎంఐ మ్యాచ్‌కు వరుణ గండం

కలం, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ (RR vs MI) కు వరుణ గండం పొంచి ఉంది. మంగళవారం రాత్రి గౌహతిలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణం విషయానికి వస్తే, సాయంత్రం సమయంలో గువాహటిలో ఆకాశం స్పష్టంగా ఉండే అవకాశముందని, ఉష్ణోగ్రత సుమారు 21 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా వేయబడింది. వర్షం వచ్చే అవకాశం 14 శాతం ఉండగా, మేఘావరణం 48 శాతం వరకు ఉండవచ్చని తెలిపారు. అయితే రాత్రి సమయంలో పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొంత మేఘావరణంతో పాటు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా. ఉష్ణోగ్రత 19 డిగ్రీల వరకు తగ్గవచ్చని, వర్షం వచ్చే అవకాశం 70 శాతం వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. మేఘావరణం 81 శాతం, ఆర్ద్రత 91 శాతం వరకు ఉండే అవకాశం ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ (RR vs MI) సాగుదలపై వాతావరణం ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మ్యాచ్ నిర్వాహకులు పరిస్థితులను పర్యవేక్షిస్తూ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ సీజన్‌ (IPL 2026)లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ఆరంభం చేశారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింటినీ గెలుచుకుని జోష్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించారు. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌ఆర్ 210 పరుగులు సాధించింది. ధృవ్ జురెల్ 42 బంతుల్లో 75 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. యశస్వి జైస్వాల్ 36 బంతుల్లో 55 పరుగులు చేశారు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీసి మెప్పించగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే డెత్ ఓవర్లలో కీలకంగా నిలిచారు.

ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి మిశ్రమంగా ఉంది. ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ 162 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సమీర్ రిజ్వీ 51 బంతుల్లో 90 పరుగులు చేసి ఎంఐ ఆశలను దెబ్బతీశారు. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చేరడం జట్టుకు ఉత్సాహాన్నిచ్చే అంశంగా భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>