ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) వర్షాకాల సమావేశాలకు తేదీలను ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సభను నిర్వహించాలని భావిస్తోంది. రాజధాని అమరావతి సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహణకు ప్రాథమికంగా నిర్ణయించిన కేబినెట్.. అవసరమైతే బీఏసీలో చర్చించాక పొడగించే అవకాశం కూడా ఉంది.

పలు కీలక బిల్లులకు ఆమోదం..

కేబినెట్ భేటీ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026ను ఆమోదించింది. దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. వాటి స్థానంలో మరింత కఠిన నిబంధనలతో కూడిన చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది. అలాగే, పీపీపీ పాలసీ-2026, పాదచారుల భద్రత పాలసీ-2026కు కూడా ఆమోదం తెలిపింది. యూడీఏల పునర్‌వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>