కలం, వెబ్ డెస్క్ : రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబంలో అంతర్గత వివాదాలు రచ్చకెక్కాయి. తన తండ్రి నుంచే తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన కుమారుడు (Prakash Goud Son) తీవ్ర ఆరోపణలు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం తండ్రికి ఎంతమాత్రం ఇష్టం లేదని ఎమ్మెల్యే తనయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాబోయే భార్య ఇంటిపై తండ్రి తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. తమను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఏ క్షణంలో ఏమవుతుందోననే భయం గుప్పిట్లో బతుకుతున్నామని పేర్కొన్నారు. తనకు, కాబోయే భార్య కుటుంబ సభ్యులకు తక్షణమే రక్షణ కల్పించాలని పోలీసులను ఆయన కోరారు.
Also Read : క్షుద్రపూజల కామెంట్లపై స్పందించిన హరీష్ రావు!
Follow Us On : WhatsApp

