epaper
Wednesday, February 18, 2026
epaper

బెంగుళూరులో ఏఐ ఆంథ్రోపిక్ ఆఫీస్.. ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్

కలం, డెస్క్ : ఐటీ ఉద్యోగుల్లో గుబులు పుట్టించిన ఆంథ్రోపిక్ ఏఐ (Anthropic AI) టెక్నాలజీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. బెంగుళూరులో దీని మొదటి ఆఫీస్ ప్రారంభమైంది. ఈ ఆఫీస్ వస్తూనే అనేక కంపెనీలతో భాగస్వామ్యాన్ని ప్రారంభించింది. ఇప్పటికే టోక్యోలో ఒక ఆఫీస్ ఉన్న ఈ కంపెనీకి.. ఆసియాలో ఇది రెండోది. ఈ కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇరినా ఘోష్ మాట్లాడుతూ.. ఆంథ్రోపిక్ ఏఐ పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న కంపెనీలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా, కాగ్నిజెంట్ లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

పెద్ద కంపెనీలే కాకుండా అనేక చిన్న కంపెనీలు కూడా తమ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నట్టు ఆంథ్రోపిక్ ఏఐ ఎండీ ఇరినా ఘోష్ తెలిపారు. తమ కంపెనీ వల్ల ఇండియాలో టెక్నాలజీ మరింత స్పీడ్ గా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ చూపించడమే తమ పనితనం అన్నారు. ఇండియన్ కంపెనీలు ఈ ఆంథ్రోపిక్ ఏఐ (Anthropic AI) రాకతో కొంత సంతోషంలో ఉన్నా.. ఉద్యోగుల్లో మాత్రం ఒకింత నిరాశ కనిపిస్తోంది.

ఎందుకంటే రీసెంట్ గానే ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ సీఈవో అమోడీ చేసిన కామెంట్లు ఇంకా ఎవరూ మార్చిపోలేదు. ఈ టెక్నాలజీ వల్ల రాబోయే రోజుల్లో 50 శాతం వైట్ కాలర్ జాబులు పోతాయన్నారు. రాబోయే ఏడాదిలోపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను పూర్తిగా రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్, టూల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంథ్రోపిక్ ఏఐ ఇండియాకు రావడంతో.. మన దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఐటీ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీ రాకతో మరిన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉన్నట్టు కొందరు పోస్టులు పెడుతున్నారు.

Read Also: ఇండియాలో మళ్లీ నిలిచిన X సేవలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>