epaper
Wednesday, February 18, 2026
epaper

జేఈఈ మెయిన్ రిజల్ట్స్​ ​: 100 పర్సంటైల్​లో మనోళ్లు ముగ్గురు

కలం, వెబ్​డెస్క్​: జేఈఈ మెయిన్ (JEE Mains 2026)​ 2026 సెషన్​ 1లోని పేపర్​ 1 (బీఈ/బీటెక్​) కు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 100 పర్సంటైల్​ 12 మంది సాధించారు. ఇందులో తెలుగువాళ్లు ముగ్గురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్​తోపాటు తెలంగాణకు చెందిన వివాన్​ శరద్​ మహిశ్వరి హండ్రెడ్​ పర్సంటైల్​ సాధించారు. జాతీయ స్థాయిలో మహిత్​ రెండో స్థానం, మోహిత్​ తొమ్మిదవ, శరద్​ మహిశ్వరి 12 స్థానం పొందారు. మొదటి ర్యాంక్​ను ఢిల్లీకి చెందిన శ్రేయస్​ మిశ్రా పొందారు. ఓబీసీ–ఎన్​సీఎల్​ కేటగిరీలో మోహిత్​ టాప్​ ర్యాంక్​ సాధించారు. ఎస్సీ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన దేవ శ్రీవేద్​ 99.999 పర్సంటైల్​తో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందారు. హండ్రెడ్​ పర్సంటైల్​ పొందినవాళ్లలో అమ్మాయిలు ఒక్కరూ లేకపోవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఎన్​ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్​ఐటీల్లో బీఈ/బీటెక్​లో ప్రవేశాల కోసం జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(ఎన్​టీఏ) జేఈఈ మెయిన్​ 1 పరీక్ష నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫైనల్ కీని ఈరోజు ఉదయం విడుదల చేసిన ఎన్​టీఏ.. ఫలితాలను సాయంత్రం రిలీజ్​ చేసింది. కాగా, జనవరి 29న నిర్వహించిన పేపర్​ 2 పరీక్ష ఫలితాలను త్వరలో రిలీజ్​ చేస్తారు.

ఈ ఏడాది పేపర్​1 పరీక్షకు 13,55,293 మంది దరఖాస్తు చేసుకున్నారు. 13,04,653 మంది(96.26%) మంది ఎగ్జామ్​కు హాజరయ్యారు.

Read Also: బెంగుళూరులో ఏఐ ఆంథ్రోపిక్ ఆఫీస్.. ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>