కలం, తెలంగాణ బ్యూరో: నిన్న మొన్నటి వరకు బస్తీల్లో ‘నువ్వెంతంటే.. నువ్వెంత..’ అంటూ జబ్బలు, తొడలు చరుచుకున్నారు పార్టీల లీడర్లు. వీర విజృంభణ చేశారు కార్యకర్తలు. ఇప్పుడు మున్సిపాలిటీల చైర్‌పర్సన్, కార్పొరేషన్‌ల మేయర్ పోస్టుల (Mayor and Chairperson Posts) కోసం ఒక్కటైపోయారు! పీఠం కోసం రాజకీయ ప్రత్యర్థులు అలయ్ బలయ్ చేసుకున్నారు. హంగ్‌ల అడ్డాల్లో హగ్గులు ఇచ్చుకున్నారు. ప్రత్యర్థికి కుర్చీ దక్కకుండా.. పావులు కదిపారు. ఎత్తుకు పైఎత్తులు వేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ.. ఇంకొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ డ్యూయెట్లు.. కొన్నిచోట్ల స్ట్రీట్ ఫైట్.. ఇంకొన్ని చోట్ల లబోదిబోమంటూ రాజీనామాలు… ఓటేసిన ప్రజలు మాత్రం ముక్కున వేలేసుకున్నారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పీఠాల కోసం సోమవారం అనేకచోట్ల హైడ్రామా నడిచింది.. హైటెన్షన్ నెలకొన్నది.. ‘హంగ్’ ఉన్నచోట ‘కింగ్’ కోసం పార్టీలు విశ్వప్రయత్నాలు చేశాయి. పోలింగ్ తర్వాత మొదలైన క్యాంపు రాజకీయాలు పాలకవర్గాలు కొలువుదీరే వరకూ ఐదు రోజుల పాటు కొనసాగాయి. క్షణ క్షణం టెన్షన్ టెన్షన్.. ఏ విన్నర్ ఎటు జంప్ అవుతారోననే సస్పెన్స్.. పాలకవర్గం ఎన్నికలో చెయ్యెత్తేది ఎవరు, చెయ్యిచ్చేది ఎవరు అనే డిస్కషన్స్.. ‘హంగ్’ మున్సిపాలిటీల్లో హాట్ సీన్… చివరికి పాలకవర్గాలు కొలువుదీరాయి. సరికొత్త ‘పొత్తు’పొడుపులు పొడిచాయి. కొన్ని వాయిదా పడ్డాయి. సిద్ధాంతాల్లేవ్.. విలువల్లేవ్.. పార్టీల తేడాల్లేవ్.. నైతికత అసలే లేదు. అంతా పవర్ పాలిటిక్స్.
కుర్చీకోసం కొనసాగిన కుమ్మక్కు రాజకీయాలపై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: పెళ్లిబాజాలకు వేళాయే.. ముహూర్తాలు ఎలా ఉన్నాయంటే!
Follow Us On : WhatsApp


