కలం వెబ్ డెస్క్ : నిజామాబాద్(Nizamabad)లో జిల్లాలో వారం కిందట శిశు విక్రయం(Child trafficking) మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. స్థానిక రైల్వే స్టేషన్‌లో బిచ్చగత్తె తన 9 నెలల కుమారుడిని రూ.1.10 లక్షలకు విక్రయించింది. కొద్ది రోజులుగా ఆమె వద్ద బిడ్డ కనిపించకపోవడంతో స్థానికులు ఆరా తీసి విషయం తెలుసుకొని పోలీసు(Police)లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. బిడ్డను కొన్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వారం క్రితం ఎల్లమ్మ గుట్టలో సైం శిశు విక్రయం కలకలం రేపింది. ఓ తల్లి తన బిడ్డను రూ.2.40 లక్షలకు విక్రయించింది. ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.


