కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి(Peddapalli)లో మరో చెక్ డ్యాం (Check Dam) కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని మానేరు నదిపై బీఆర్ఎస్ హయాంలో 13చెక్ డ్యాంలు నిర్మించారు. గతంలో కురిసిన వర్షాలకు 5చెక్ డ్యాంలు కొట్టుకుపోయాయి. గత నెలలో పెద్దపల్లి జిల్లా గుంపుల, కరీంనగర్ జిల్లా తనుగుల గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఇప్పుడు మంథని మండలంలోని అడవిసోమన్ పల్లి వద్ద మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం వర్షాలు, వరదలు లేకపోయినా చెక్ డ్యామ్ (Check Dam) కొట్టుకుపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Read Also: డ్రోన్ ద్వారా తక్కువ ఖర్చుతో వరి సాగు : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Follow Us On: Instagram


