Mobile Popup Ad
Mobile Popup Ad

బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం: కాకినాడ తీరానికి బోట్లు !

కలం, వెబ్​ డెస్క్​ : సముద్ర మత్స్య సంపద పునరుత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో బంగాళాఖాతం (Bay of Bengal)లో వార్షిక చేపల వేట నిషేధం అమలులోకి వచ్చింది. ఈ ఆంక్షలు జూన్ 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నిషేధాజ్ఞల నేపథ్యంలో మత్స్యకారులందరూ తమ వేటను నిలిపివేసి తీరానికి చేరుకుంటున్నారు. కేవలం కాకినాడ తీరానికే సుమారు 392 మెకనైజ్డ్ బోట్లు, 3,993 మోటరైజ్డ్ బోట్లు తిరిగి వచ్చాయి.

మరోవైపు, వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏప్రిల్ 17వ తేదీ నుండి మత్స్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. అర్హులైన ప్రతి మత్స్యకారునికి ఈ సాయం అందేలా పక్కాగా వివరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>