కలం, సినిమా డెస్క్ : అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకుడిగా ఫాస్ట్ గా మూవీస్ చేయడంతో పాటు తన సినిమాల ప్రమోషన్ విషయంలో ప్రత్యేకత చూపిస్తుంటారు. ఆయన సినిమాల పబ్లిసిటీ విషయంలో టాలీవుడ్ దర్శకులకు రోల్ మోడల్ గా మారారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి మన శంకరవరప్రసాద్ గారు (MSVPG) సినిమా రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో పరుగులు పెడుతోంది.
3 రోజుల్లోనే ఈ సినిమాకు 152 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రావడం విశేషం. సంక్రాంతి హాలీడేస్ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్స్ కు వెళ్తున్నారు. దీంతో కలెక్షన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇలాంటి భారీ హిట్ తర్వాత మేకర్స్ రిలాక్స్ కావడం మామూలుగా ఇండస్ట్రీ చూస్తుంటాం. కానీ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రమోషన్ ఆపడం లేదు.
మొన్న ప్రీమియర్స్ అయ్యాక మెగాస్టార్ తో చిన్న డైలాగ్ చెప్పించాడు. అలాగే సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా విక్టరీని, మెగాస్టార్ తో వీలైనంత మూవీ గురించి చెప్పించాడు. ఇలా తన సినిమాను ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలనే క్రమంలో తాజాగా స్పెషల్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఆకట్టుకుంటోంది. ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్, విక్టరీ వెంకటేష్ తో అనిల్ సందడి చేశారు. వీలైనంత చివరి వరకు తన సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లాలనే అనిల్ ప్రయత్నం అభినందనీయం.
Read Also: స్వయంభూ పోస్టర్ రిలీజ్.. అదిరిపోయే లుక్‌లో నిఖిల్
Follow Us On : WhatsApp


