epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే

కలం, వెబ్​ డెస్క్​ : ఏపీ గవర్నమెంట్​ (Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ కుటుంబ వివరాలను సేకరించి, సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ప్రత్యేక మొబైల్ యాప్​ సహాయంతో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం వివరాలను డిజిటల్​ రూపంలో నమోదు చేస్తారు. సర్వే ద్వారా ప్రజలకు అవసరమైన పథకాలు, లబ్ధిదారుల వివరాలు తెలుస్తాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>