epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

షఫాలీ ధనాధన్​.. రెండో టీ20 భారత్​ మహిళలదే

కలం, వెబ్​డెస్క్​: షఫాలీ వర్మ (Shafali Varma) ధనాధన్​ బ్యాటింగ్​తో రాణించడంతో లంకతో పొట్టి సిరీస్​లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. విశాఖపట్నం వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన  రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్​ చమరి ఆటపట్టు(31; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్​లు), హర్షిత సమరవిక్రమ(33; 32 బంతుల్లో 4 ఫోర్లు) ఓ మోస్తరు పరుగులు చేయగా, మిగిలినవాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో శ్రీచరణి, వైష్ణవి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. స్నేహ్​ రాణా, క్రాంతి గౌడ్​ ఒక్కో వికెట్​ పడగొట్టారు.

అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​ 11.5 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి గెలుపందుకుంది. ఓపెనర్​ షఫాలీ వర్మ (Shafali Varma) అర్ధ సెంచరీ (69 నాటౌట్​: 34 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్​) చేసింది. జెమీమా రోడ్రిగ్స్​(26; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్​), స్మృతి మంధాన(14; 11 బంతుల్లో 1 ఫోర్​, 1 సిక్స్​), హర్మన్​ప్రీత్​ కౌర్​(10) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష, కావ్య, మదార తలో వికెట్​ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్​ల సిరీస్​లో భారత్​ 2‌‌–0 ఆధిక్యం సాధించింది. తరువాతి మ్యాచ్​ తిరువనంతపురం వేదికగా ఈ నెల 26న జరుగుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>