కలం, వెబ్ డెస్క్: సమాజ సేవను సైతం శిక్షలో భాగంగా చేర్చుతూ ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పూర్తి స్థాయి మార్గదర్శకాలను విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. నేర స్వభావాన్ని బట్టి అప్పుడప్పుడు హైకోర్ట్ సహా కింది స్థాయి న్యాయస్థానాలు నేరస్థులకు ఒక రోజు నుంచి 31 రోజుల వరకు సమాజ సేవ శిక్షలు విధిస్తుంటాయి. ఉదహరణకు ట్రాఫిక్ లో పనిచేయడం, పారిశుద్ధ్య పనులు చేయడం వంటివి చేయాలని సూచిస్తుంటాయి. తద్వారా, వారి ప్రవర్తనలో మార్పు వచ్చి.. చేసిన తప్పులు మళ్లీ చేయకపోవడంతో పాటు సమాజంపై బాధ్యత పెంచడమే ఈ శిక్షల లక్ష్యం. ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి పనులు చేయాలనేదే ప్రభుత్వ పరంగా ఎలాంటి మార్గదర్శకాలు లేవు.
వీటిలో పనిచేస్తే.. సమాజ శిక్షనే
కోర్టులు ఎవరికైనా సమాజ సేవ శిక్షలు విధించినప్పుడు ఇక నుంచి అలాంటి వారు ఆసుపత్రులు, మున్సిపాలిటీలు, జూ పార్కులు, పబ్లిక్ పార్కులు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రభుత్వ స్కూల్స్, లైబ్రరీల్లో పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ నిర్దేశించాల్సిన పనులు చేయాలని రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

