Mobile Popup Ad
Mobile Popup Ad

డెవలపర్లకు గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్‌లోకి గూగుల్ AI Studio

కలం, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google) డెవలపర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. గూగుల్ తన Al ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన గూగుల్ ఏఐ స్టూడియో (Google Al Studio) ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ సేవ వెబ్ ఆధారంగా మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మొబైల్ యాప్ రూపంలో కూడా అందుబాటులోకి రావడం టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది.

Google Al Studio అనేది డెవలపర్లు, కంటెంట్ క్రియేటర్లు, స్టార్టప్లు AI మోడళ్లను సులభంగా టెస్ట్ చేయడానికి, ప్రాంప్టు రూపొందించడానికి, Al యాప్లు డెవలప్ చేయడానికి ఉపయోగించే ప్లాట్‌ఫారమ్. ముఖ్యంగా Google Gemini Al మోడళ్లను ఉపయోగించేందుకు ఇది కీలక వేదికగా పనిచేస్తోంది.

ఆండ్రాయిడ్ యాప్‌లో ఏముంటాయి?

కొత్త Android వెర్షన్లో వినియోగదారులు.. AI చాట్ మోడళ్లను పరీక్షించవచ్చు, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ చేయవచ్చు, Gemini APIలను యాక్సెస్ చేయవచ్చు, రియల్ టైమ్ AI రెస్పాన్స్‌లను చూడవచ్చు. అంతే కాకుండా మొబైల్ నుంచే AI ప్రాజెక్టులు నిర్వహించవచ్చట.
అలాగే డెవలపర్లకు కోడ్ టెస్టింగ్, AI టూల్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయట.

ప్రత్యేకత ఏమిటి?

ఇప్పటి వరకు AI టెస్టింగ్ కోసం కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ నుంచే AI మోడళ్లను నిర్వహించే అవకాశం రావడంతో డెవలపర్లకు పెద్ద సౌలభ్యంగా మారనుంది.

Gemini Alకి మరింత బలం

Google ఇప్పటికే Gemini Al సేవలను Gmail, Docs, Android, Search వంటి ప్లాట్ ఫారమ్‌లలో విస్తరించింది. ఇప్పుడు Al Studio యాప్ ద్వారా డెవలపర్లను మరింతగా ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎక్కడ అందుబాటులో ఉంది?

Google Al Studio Android యాప్‌ను దశలవారీగా విడుదల చేస్తోంది. కొంతమంది వినియోగదారులకు ఇప్పటికే Google Play Storeలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా అన్ని Android యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. OpenAl, Microsoft, Meta వంటి కంపెనీలు AI రంగంలో దూసుకెళ్తుండగా, Google కూడా Gemini ఆధారిత సేవలను వేగంగా విస్తరిస్తోంది. Al Studio మొబైల్ యాప్ విడుదలతో AI డెవలప్మెంట్ మరింత సులభం కానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>