కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రజల రాజధాని కాంక్ష నెరవేరింది. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అమరావతి (Amaravati) రాజధాని గా మారింది. ఈ మేరకు ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఆమోదం తెలిపింది. అమరావతి బిల్లును ఉభయసభలు సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించాయి. అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్ సభ లో బుధవారం చర్చించి ఆమోదం తెలిపారు. గురువారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేశారు. అమరావతి చట్ట బద్ధత బిల్లుకు ఆమోదముద్ర లభించడంతో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ బిల్లును రాష్ట్రపతి ముర్ము వద్దకు పంపారు.ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి (Amaravati) అమల్లోకి రానుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాజధాని అమరావతిలో సంబరాలు మిన్నంటాయి.
Read Also: ఇక ఏపీకి అమరావతే ఏకైక రాజధాని: సీఎం చంద్రబాబు
Follow Us On : WhatsApp

