కలం, వెబ్ డెస్క్ : నటుడు శివాజీ(Shivaji) హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పలువురు యాక్టర్లు, నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్, నటి అనసూయ (Anasuya) కూడా ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తమకు నచ్చిన బట్టలను వేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉందని, వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం సరైంది కాదన్నారు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్‌తోనే శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. ఆయన చెప్పినంత మాత్రానా వింటామా అని, తిండి, బట్ట అనేది వ్యక్తిగతమైనవి ఇలాంటి వాటి విషయంలో ఎవరికి నచ్చినట్లు వారు ఉండాలన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై మాట్లాడుతున్నప్పుడు శివాజీ కూడా పద్దతి ప్రకారం ఉండాలని అనసూయ(Anasuya) సూచించారు.
కాగా, శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో శివాజీ హీరోయిన్ల డ్రెస్సులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనం దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. అందం చీరలోనో, నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుంది. సామాన్లు కనపడే దాంట్లో ఉండదు’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Read Also: శంబాల టీమ్ కు సపోర్ట్ గా కిరణ్ అబ్బవరం
Follow Us On: X(Twitter)


