కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ ఓ డీసీఎం (Attapur Accident) బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉప్పరపల్లి మెట్రో పిల్లర్ 191 సమీపంలో పోలీసులపైకి డీసీఎం వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టౌలీచౌకీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్ అనే కానిస్టేబుల్ స్పాట్ లోనే చనిపోయారు. డ్యూటీ ముగించుకుని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: విద్యార్థిపై సీనియర్లతో దాడి చేయించిన ప్రిన్సిపల్
Follow Us On: Sharechat


