ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యే కీలక సూచనలు

కలం, జగిత్యాల: బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అధికారులు అరికట్టాలని, బియ్యం ధరలను కృత్రిమంగా పెంచే వ్యాపారులపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను పకడ్బందీగా అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులకు సాగునీరు, విద్యుత్ సరఫరా చేసి ఒక్క గుంట పంట కూడా ఎండిపోకుండా చూశామని పేర్కొన్నారు.

జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం చల్గల్ (Chelgal) వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ప్రసూనాంబతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా, సజావుగా ధాన్యం సేకరణ ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

చల్గల్ వ్యవసాయ మార్కెట్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.8 కోట్ల వ్యయంతో షెడ్ల నిర్మాణం చేపట్టామని, రూ.1.80 కోట్లతో సీసీ రోడ్డు పనులు పూర్తి చేసినట్లు వివరించారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆరుతడి పంటలను సాగు చేసే దిశగా ఆలోచించాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రసూనాంబ, పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, డీసీఓ మనోజ్, డీసీఎస్ఓ జితేందర్ రెడ్డి, ఎమ్మార్వో హకీం, ఏఎంసీ వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెండెం రాములు, సమిండ్ల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం జిల్లా, మండల అధ్యక్షులు బొలిశెట్టి గంగారెడ్డి, కట్ట రాజేందర్, సర్పంచులు జున్ను రాజేందర్, రాజేందర్, మల్లారెడ్డి, మల్లేష్, ఏఓ తిరుపతి నాయక్, సీఈఓ వేణు, పీఏసీఎస్ డైరెక్టర్లు పురుషోత్తం రావు, గంగారం, నీరటి గంగారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గడ్డం గంగారెడ్డి, అసెంబ్లీ యూత్ అధ్యక్షులు భూమారెడ్డి, నాయకులు రమణ రావు, పులిశెట్టి శ్రీనివాస్, అంకం సతీష్, నలువాల సురేష్, దాసరి సతీష్, నరేష్, పూర్ణచందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>