సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన సునీల్ రావు

కలం, కరీంనగర్: నగరంలోని (Karimnagar) పలు డివిజన్లలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశిలించారు. రోడ్డులో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చాలా కాలం పాటు మన్నికగా ఉండే విధంగా నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. త్వరలోనే ప్రజలకు అందమైన సీసీ రోడ్లను అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>