కలం, నిర్మల్: జాతీయ విద్యా దినోత్సవాన్ని (National Education Day ) పురస్కరించుకుని నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో (Nirmal Collectorate) బుధవారం దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవరావు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, కార్మిక శాఖ అధికారి రాజలింగం, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్, మైనార్టీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

