బరువు తగ్గిస్తానని నమ్మించి.. యువతిపై జిమ్ ట్రైనర్ లైంగికదాడి..!

కలం, వెబ్ డెస్క్ : విజ‌య‌వాడ‌ (Vijayawada) లో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువతిని బరువు తగ్గిస్తానని నమ్మించిన జిమ్ ట్రైనర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు.

లావుగా ఉన్న త‌న‌ను స్లిమ్ గా మార్చేందుకు జిమ్ స‌ల‌హాలు ఇస్తూ ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తనను ప్రైవేట్ హోట‌ల్‌కు తీసుకువెళ్ళి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ మత్తు మందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టినట్లు యువతి ఆరోపించింది. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి.. నగ్న ఫోటోలు తీసినట్లు బాధితురాలు వాపోయింది.

సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించిన యువతి.. తనపై లైంగికదాడి చేశాడని జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై ఫిర్యాదు చేసింది. దీంతో యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న జిమ్ ట్రైనర్ ఖాదర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read Also: ప్రమాదంలో కోట్లాది యువత.. WHO సంచలన రిపోర్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>