కలం, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం కరీంనగర్ లో భారీ సదస్సు ఏర్పాటు చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఆద్వర్యంలో స్థానిక అంబేద్కర్ స్టేడియంలో విధ్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, యువతకు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విధ్యార్థులు, యువతతో ఈ భారీ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) హాజరు కానున్నట్లు నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తెలిపారు. ఈ క్రమంలో స్టేడియంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. సభకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాలని సూచించారు.

