నిజాం కాలం నాటి భూముల్లో అర్ధరాత్రి తవ్వకాలు

కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి (Inugurthi) మండలంలో గుప్తనిధుల వ్యవహారం కలకలం రేపుతోంది. మండలంలోని అయ్యగారిపల్లి పరిధిలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిజాం కాలం నాటి భూముల్లో గుప్తనిధులు ఉన్నాయన్న ప్రచారంతో కొందరు వ్యక్తులు అక్కడ క్షుద్రపూజలు నిర్వహించి, అనంతరం తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తవ్వకాలు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలపై ఆరా తీస్తున్నారు. కాగా, తవ్వకాల్లో పెద్ద మొత్తంలో గుప్తనిధి లభించిందంటూ గ్రామంలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరు? ఏ మేరకు తవ్వకాలు చేపట్టారు? నిజంగానే ఏదైనా విలువైన వస్తువులు లభించాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>