జపాన్‌లో టీమ్‌ఇండియా.. సెప్టెంబర్ 22న టీ20!

కలం, స్పోర్ట్స్ : జపాన్ గడ్డపై టీమ్‌ఇండియా (Team India )అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 22న జపాన్‌తో భారత్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ఇరు దేశాల దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్‌లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. జపాన్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ కలిసి ఈ మ్యాచ్‌ను ప్రకటించాయి. సుజుకి కప్‌లో భాగంగా ఈ పోరు జరగనుంది. భారత్-జపాన్ మధ్య క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆసియా క్రీడల జట్టులో ఉన్న వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ అప్పటికే జపాన్‌లో ఉంటారు. దీంతో వారికి ఈ మ్యాచ్ ప్రత్యేకంగా మారనుంది. భారత్‌కు జపాన్‌లో టీ20 మ్యాచ్ ఆడటం ఇదే కొత్త అనుభవం. జపాన్‌లో క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుందని బీసీసీఐ తెలిపింది. జపాన్‌లో క్రికెట్‌కు కొత్త ప్రేక్షకులను తీసుకురావడానికి ఇది అవకాశం కల్పిస్తుందని పేర్కొంది.

భారత జట్టుతో ఆడటం తమకు చారిత్రాత్మక సందర్భమని జపాన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. టీమ్‌ఇండియాకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. స్థానిక జపాన్ ప్రజలు కూడా మ్యాచ్‌ను వీక్షించి తమ జట్టును ప్రోత్సహించాలని కోరింది. సెప్టెంబర్ 22న జరగనున్న ఈ మ్యాచ్‌తో భారత్-జపాన్ మధ్య క్రికెట్ సంబంధాల్లో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>