కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీస్సా హీలీ (Alyssa Healy) సంచలన నిర్ణయం తీసుకున్నది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయింది. ఫిబ్రవరి-మార్చ్ 2026లో భారత్‌తో ఆడనున్న సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కానున్నట్లు తెలిపారు హీలీ. 16 ఏళ్ల కెరీర్‌లో ఆమె పలు రికార్డులు సృష్టించారు.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నీ లీ ఈ విషయం చెప్పింది. మానసిక, శారీరక ఒత్తిడులు, గాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. టీ20 సిరీస్‌కు రెడీ కావడానికి చాలా తక్కువ సమయం ఉందని, అందుకే ఆ సిరీస్ నుంచి తప్పుకున్నానని తెలిపారు. కానీ వన్డేలు, పర్థ్‌లోని వెస్టర్న ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్(WACA)లో జరుగనున్న ఒక ఆఫ్‌డే అండ్ నైట్ టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు చెప్పారు.
“భారత్‌తో ఆడే సిరీస్ నా కెరీర్ చివరి సిరీస్. దేశం కోసం ఆడటం ఇష్టం, కానీ ఆ డ్రైవ్ అలాగే లేదు. టీ20 వరల్డ్ కప్‌లో లేకపోయినా వన్డేలు, టెస్ట్ సైడ్స్‌లో కెప్టెన్‌గా ఆడటానికి ఉత్సాహంగా ఉన్నా. తోటి ఆటగాళ్లను, టీమ్ సాంగ్, ఓపెనింగ్ బ్యాటింగ్ అనుభవాలు మిస్ అవుతా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గొప్ప గౌరవం. చివరి సిరీస్ కోసం చాలా కృతజ్ఞతగా ఉన్నాను” అని హీలీ చెప్పారు.

Read Also: ’మన శంకరవరప్రసాద్ గారు‘ డే 1 కలెక్షన్లు ఎంతంటే..
Follow Us On: Sharechat


