కలం, వెబ్ డెస్క్: వాలెంటైన్స్ డే సందర్భంగా అల్లు శిరీష్ (Allu Sirish) తనకు కాబోయే భార్య నయనికపై ప్రేమను చాటుకుంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ ప్రయాణంలో సొంతం చేసుకున్న అద్భుతమైన క్షణాలను ఈ వీడియోలో చూడొచ్చు. వీరిద్దరి కెమిస్ట్రీ, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అల్లు శిరీష్, నయనిక (Allu Sirish – Nayanika) వివాహం మార్చి 6, 2026న గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న శుక్రవారం హైదరాబాద్‌లో అల్లు అరవింద్ నివాసంలో ‘పసుపు దంచే’ కార్యక్రమంతో పెళ్లి పనులు షురూ అయ్యాయి. ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అల్లు అర్జున్ పెళ్లి తేదీన (మార్చి 6) శిరీష్ పెళ్లి కూడా జరుగబోతుండటం ఈ వేడుకకు ప్రత్యేకత ఏర్పడింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా అల్లు శిరీష్ తనకు కాబోయే భార్య నయనిక రెడ్డిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో షేర్ చేశాడు.
Valentine’s Day Special: Allu Sirish Shares Heartwarming Video for Fiancée Nayanika Reddy#AlluSirish #NayanikaReddy #ValentinesDay… pic.twitter.com/ligzftnSSp
— Kalam Daily (@kalamtelugu) February 14, 2026
Read Also: వైభవ్ సూర్యవంశీ ‘స్టూడెంట్’ ఇన్నింగ్స్.. టెన్త్ పరీక్షలు రాయనున్న యంగ్ బ్యాటర్
Follow Us On: Sharechat


