epaper
Wednesday, February 18, 2026
epaper

మాకు ఏ దేశం ‘మాస్టర్​’ కాదు : తారిఖ్​ రహ్మాన్​

కలం, వెబ్​డెస్క్​ : దేశ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బంగ్లాదేశ్​ విదేశాంగ విధానం ఉంటుందని ఆ దేశానికి కాబోయే ప్రధాన మంత్రి, బంగ్లాదేశ్​ నేషనల్​ పార్టీ(BNP) అధినేత తారిఖ్ రహ్మాన్​ స్పష్టం చేశారు (Tarique Rahman). బంగ్లాదేశ్​ పార్లమెంట్​కు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్​పీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 297 స్థానాలకు బీఎన్​పీ 212 సీట్లను గెలుచుకుంది. పార్టీ ఏకపక్ష విజయం అనంతరం శనివారం తారిఖ్​ రహ్మాన్​ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్​తో సహా పొరుగు దేశాలతో సంబంధాలపై తమ వైఖరిని వెల్లడించారు.

బంగ్లాదేశ్​కు కాబోయే ప్రధానిగా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న ఆయన.. ప్రాంతీయ శక్తులైన భారత్​, చైనా, పాకిస్థాన్​తో దేశ సంబంధాలపై స్పందించారు. ‘బంగ్లాదేశ్​ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా దేశ విదేశాంగ విధానం ఉంటుంది. పొరుగు దేశాలతో సంబంధాలు ఉంటాయి’ అని తారిఖ్​ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్​ మాజీ ప్రధాని, ఇటీవలే దివంగతరాలైన ఖలీదా జియా కుమారుడైన తారిఖ్​.. దాదాపు 17 ఏళ్ల అనంతరం స్వదేశంలో అడుగుపెట్టారు. ఏడాదిన్నర కిందట విద్యార్థుల ఆందోళనలతో అప్పటి ప్రధాని షేక్​ హసీనా (Sheikh Hasina) పదవిని, దేశాన్ని వదిలేసి భారత్​లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహ్మద్​ యూనస్​ (Muhammad Yunus) సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట తిరిగి బంగ్లాదేశ్​కు వచ్చిన తారిఖ్​.. ఎన్నికల్లో బీఎన్​పీ విజయం సాధించడంతో త్వరలో ప్రధాని పీఠం ఎక్కనున్నారు.

ప్రధాని మోదీకి ఆహ్వానం!

బంగ్లాదేశ్​ ప్రధానిగా తారిఖ్​ రహ్మాన్ (Tarique Rahman)​ ప్రమాణ స్వీకారానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించాలని బీఎన్​పీ భావిస్తున్నట్ల సమాచారం. భారత్​తోపాటు దక్షిణాసియా దేశాల ప్రధానులు, అధ్యక్షులను ఆహ్వానించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్న తెలుస్తోంది. కాగా, భారత వ్యతిరేక అల్లర్లతో ఏడాదిన్నరగా అట్టుడికిన బంగ్లాదేశ్​లో హిందువులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్​కు వెళతారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే, ఇప్పటికే బీఎన్​పీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ తారిఖ్​ రహ్మాన్​కు ప్రధాని మోదీ ఫోన్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరైతే భారత్​, బంగ్లాదేశ్ (Bangladesh)​లో సంబంధాల్లో కొత్త మార్పలకు శ్రీకారం చుట్టే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: సరికొత్తగా ‘ఆధార్’.. కీలక మార్పులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>