సాయం చేయమంటే.. రూ.4.5 లక్షలు దోచేశారు

కలం, ఆలేరు​ : ఏటీఎంలో పిన్​ జనరేట్ చేయమని సాయం అడిగినందుకు దుండగుడు ఏకంగా రూ.4.5 లక్షలు కాజేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా, మూటకొండూరు మండలంలో జరిగింది. మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన మొగిలి పాక యాదయ్య అనే వృద్ధుడు తన తండ్రి భూమిని అమ్మేశాడు. దీంతో వచ్చిన రూ.4.51 లక్షలను ఆలేరు స్టేట్​ బ్యాంకులో తన కూతురు స్వరూప ఉమ్మడి ఖాతాలో జమచేశాడు. దీనిపై వచ్చిన వడ్డీతో తన అవసరాలను తీర్చుకుంటున్నాడు. సెప్టెంబర్​ లో ఏటీఎం కార్డు జారీ రావడంతో పిన్ జనరేట్ చేసుకోవడానికి భువనగిరి (Bhuvanagiri) పాత బస్టాండ్ సమీపంలోని ఎస్బిఐ ఏటీఎంకు వచ్చారు.

కూతురికి పిన్ జనరేట్ ఎలా చేయాలో తెలియకపోవడంతో, అదే సమయంలో ఏటీఎంలోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తిని సాయం అడిగారు. ఆ అపరిచితుడు పిన్ జనరేట్ చేస్తూనే యాదయ్య ఖాతాలోని నగదును చూసి, తన దగ్గరున్న ఏటీఎం కార్డును మార్చి యాదయ్య కార్డును తీసుకెళ్లిపోయాడు. ఆ తరువాత రోజుకు పదివేల రూపాయల చొప్పున నగదు విత్‌డ్రా చేసి, మొత్తం 4 లక్షల 51 వేల రూపాయలను దోచుకున్నాడు. పింఛన్ జమ అయిందేమో చూద్దామని ఏటీఎం కార్డు చూస్తే.. అది యాదయ్యది కాకుండా మరొకరి పేరుతో ఉండటంతో షాక్ అయ్యారు.

వెంటనే మూటకొండూరు మండలం చాడ గ్రామం నుంచి ఆలేరు ఎస్బిఐ బ్యాంకుకు వచ్చి పాస్‌బుక్‌తో బ్యాలెన్స్ చెక్ చేయగా.. ఖాతాలో కేవలం 174 రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిసి మరింత షాక్‌కు గురయ్యారు. చేసేదేమీ లేక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వద్దకు వెళ్లి జరిగిన మొత్తం విషయం వివరించారు. వెంటనే ఎమ్మెల్యే పోలీసులను సంప్రదించి, నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే బాధితులకు తనవంతు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

Read Also: వింటర్​ ఒలింపిక్స్​లో కండోమ్స్​ కొరత.. 72 గంటల్లో 10 వేలు ఖాళీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>